మేమంతా తీసుకున్న నిర్ణయమే: సూర్య
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినా, ట్రోఫీ అందుకోలేదు.

ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినా, ట్రోఫీ అందుకోలేదు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దీనిపై స్పందించారు. ట్రోఫీని తాము తిరస్కరించలేదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులే దానిని తీసుకుని వెళ్లిపోయారన్నారు. మేము డ్రెస్సింగ్ రూమ్‌లో తలుపులు మూసుకుని కూర్చోలేదు. బహుమతి ప్రదానోత్సవం కోసం ఎవరినీ ఎదురు చూసేలా చేయలేదని తెలిపారు. టోర్నమెంట్ మొత్తంలో ప్రభుత్వం నుంచి గానీ, బీసీసీఐ నుంచి గానీ మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఫలానా వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవద్దని తమకు ఎవరూ చెప్పలేదన్నారు సూర్య. ఆ నిర్ణయం పూర్తిగా మేమే మైదానంలో సొంతంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏసీసీ అధికారులు వేదికపై నిలబడి ఉన్నారు. తాము కింద ఉన్నామని, ఇంతలో ప్రేక్షకుల నుంచి కొందరు అరుస్తున్నారు. ఆ తర్వాత వారి ప్రతినిధి ఒకరు ట్రోఫీని తీసుకుని వేగంగా వెళ్లిపోవడం కనిపించిందని సూర్యకుమార్ వివరించారు.

