దయచేసి ఎవరినీ నిందించొద్దంటున్న ఇర్ఫాన్ పఠాన్
ఓ అభిమాని చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. అతడు ఈ లీగుల్లో ఇర్ఫాన్ పఠాన్ చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్

ఇర్ఫాన్ పఠాన్.. ఎంతో అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆల్ రౌండర్..! కానీ ఊహించని విధంగా జట్టుకు దూరమవ్వడం అతడి అభిమానులకు ఎంతో బాధను కలిగించింది. అటు వన్ డౌన్ లోనూ రాగలడు.. ఇటు ఆఖరులోనూ హిట్టింగ్ చేయగలడు ఇర్ఫాన్ పఠాన్. మంచి ఆల్ రౌండర్ భారత జట్టులో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. ఇప్పుడు లెజెండ్స్ లీగ్ లో ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియా లెజెండ్స్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. సెమీ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్ పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు వచ్చిన ఇండియా లెజెండ్స్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. భారత మాజీ వికెట్ కీపర్ నమన్ ఓజా (62 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 90) భారీ షాట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతనితో పాటు ఇర్ఫాన్ పఠాన్ (37 నాటౌట్) కూడా రాణించాడు. ముఖ్యంగా ఇర్ఫాన్ ఇన్నింగ్స్ తో భారత్ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సిక్సర్లను ఇర్ఫాన్ ఈ ఇన్నింగ్స్ లో బాదాడు.

