Wed Dec 17 2025 14:14:16 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం
నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 18 ప్రారంభం కానుంది.

నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 18 ప్రారంభం కానుంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక రెండు నెలల పాటు పండగ. పది జట్లు దాదాపు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. తొలిరోజు కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. అనంతరం తొలి మ్యాచ్ ఢిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.
మొత్తం పది జట్లు....
ఇదే జట్లు 2008లో మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ లో తలపడ్డాయి. తిరిగి 18వ సీజన్ లో ఈ రెండు జట్లు మొట్టమొదటి పోటీలో పాల్గొంటున్నాయి. భారత ఆటగాళ్లతో పాటు విదేశీక్రికెటర్లతో ఈ జట్లు కనపిపిస్తుండటంతో పాటు భారీ సిక్సర్లు, ఫోర్లతో రికార్డులు నమోదు కానున్నాయి. ఈ సీజన్ లో అనేక జట్లకు కెప్టెన్ లు మారారు. నిబంధనలను కూడా స్వల్పంగా మార్చారు. రాత్రి 7.30 గంటలకు మొదటి మ్యాచ్ కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం కానుంది.
Next Story

