Fri Dec 05 2025 15:28:35 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : విరాట్ భయ్యా బ్యాట్ కు బ్యాట్ తో సమాధానం చెప్పాలి సామీ...?
ఐపీఎల్ లో ప్రస్తుతం రివెంజ్ వీక్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ కాపిటల్స్ జట్టుతో తలపడుతుంది

ఐపీఎల్ లో ప్రస్తుతం రివెంజ్ వీక్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ కాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. అయితే ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు జరగనుంది. గతంలో ఢిల్లీ కాపిటల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును దాని సొంత మైదానంలోనే ఓడించింది. ఈ మ్యాచ్ లో ఢీల్లీ కాపిటల్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ తమ జట్టును గెలిపించిన తర్వాత బ్యాట్ ను గ్రౌండ్ లో తిప్పడంతో పాటు ఇది తన హోం గ్రౌండ్ అని చెప్పారు. మూవీ కాంతారా స్టయిల్ లో కెఏల్ రాహుల్ విజయం తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం కొంత అందరినీ ఆకట్టుకున్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్ మాత్రం బాధపడ్డారు.
బెంగళూరు జట్టులోని కోహ్లి...
అయితే ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ కాపిటల్స్ తో తలపడుతుంది. అయితే ఈ మైదానం విరాట్ కోహ్లి సొంత మైదానం. చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్ లో నేర్చుకున్న కోహ్లి ఈ మైదానంలో చెలరేగి ఆడాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు. ఢిల్లీ మైదానంలో కోహ్లి పేరిట ఒక స్టాండ్ కూడా ఉంది. అయితే గతంలో బెంగళూరులో తమకు జరిగిన అవమానాకి రివెంజ్ తీర్చుకోవడానికి బరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమయింది. కోహ్లితన అడ్డాలో ఏ మేరకు బ్యాట్ కు పనిచెబుతారన్నది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ కాపిటల్స్ ను ఓడించిపాయింట్ల పట్టికలో మరింత ఎగబాకాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమయింది.
రెండు జట్లు బలాబలాలను...
అదే సమయంలో ఢిల్లీ కాపిటల్స్ జట్టును కూడా తక్కువ అంచనాలు వేయడానికి వీలులేదు. ఎందుకంటే ఆ జట్టు విజయాలు తక్కువ.. ఓటములు తక్కువగా అన్నట్లు ప్రయాణం సాగుతుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఇప్పటి వరకూ ఆడి ఆరింటిలో గెలిచి రెండింటిలోనే ఓటమి పాలయింది. పన్నెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో కొనసాగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడితే అందులో ఆరు మ్యాచ్ లలో గెలిచి మూడింటిలో ఓటమిపాలయింది. దానికి కూడా పన్నెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సో.. ఈ రెండు జట్టు ఢీ అంటే ఢీకొడుతున్నాయి. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిదన్న అంచనాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి.
Next Story

