IPL 2025 : కప్పు ఛాలెంజర్స్ దా? కింగ్స్ దా? పూనకాలు లోడింగ్
ఈరోజు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. అహ్మదా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఊపిరి బిగబట్టాల్సిందే.. చివర వరకూ టెన్షన్.. బాల్ బాల్ కు కేరింతలు.. సిక్సర్లు.. ఫోర్లతో స్టేడియం మోత మోగాల్సిందే. కేవలం స్టేడియంలో ఉన్న వారు మాత్రమే కాదు దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా మ్యాచ్ చూస్తూ మునికాళ్లపై నిల్చోక తప్పదు. గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటాయి. ఇరు జట్లకు దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు.ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అత్యధికంగా అభిమానులున్నారు. అందుకు కారణం ఆ జట్టులో విరాట్ కోహ్లి ఉండటమే. కోహ్లి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే పంజాబ్ కింగ్స్ గెలవాలని కూడా లక్షలాది మంది అభిమానులు ఇప్పటికే కోరుకుంటున్నారు. అరుదైన, మ్యాచ్ కావడంతో పాటు క్వాలిఫయిర్ 1 లో బెంగళూరుది పై చేయి కావడంతో లెక్కలన్నీ ఛాలెంజర్స్ వైపు చూపుతున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ గ్రౌండ్ లో పై చేయి సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ఈ మ్యాచ్ ఫలితం కోసం లక్షల సంఖ్యలో అభిమానులు నిరీక్షిస్తున్నారు.

