Fri Sep 13 2024 08:26:05 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa First Odi : ఏందయ్యా సామీ...ఇలా అవుటయ్యారు...మనోళ్లు ఏం చేస్తారో?
తొలి వన్డేలో ఇండియా బౌలర్లు తమ జోరు చూపించారు. అతి తక్కువ స్కోరుకు దక్షిణాఫ్రికాను తన సొంత మైదానంలో అవుట్ చేయగలిగారు
తొలి వన్డేలో ఇండియా బౌలర్లు తమ జోరు చూపించారు. మామూలుగా కాదు. వన్డేల్లో అతి తక్కువ స్కోరుకు దక్షిణాఫ్రికాను తన సొంత మైదానంలో అవుట్ చేయగలిగారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పది వికెట్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. అసలు వన్డేలో ఇంత తక్కువ స్కోరుకు అవుట్ కావడం హిస్టరీలో ఇదే మొదటి సారి అనుకోవాలేమో. యాభై ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ కేవలం 27.3 ఓవర్లకే ముగిసిపోయింది. 116 పరుగులకే దక్షిణాఫ్రికా ఆల్ అవుట్ అయింది.
టాస్ గెలిచి...
టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అదే వారి పాలిట శాపంగా మారింది. అసలు కెప్టెన్ మార్క్రమ్ తొలుత బ్యాటంగ్ ఎంచుకుని తప్పు చేశాడా? అని అనిపించేలా మ్యాచ్ సాగింది. తొలి ఓవర్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ముకేశ్ కుమార్ కట్టుదిట్టంగా బ్యాటింగ్ చేశారు. అప్పుడే డీఆర్ఎస్ కు వెళ్లుంటే వికెట్ లభించేది. కానీ తీసుకోక పోవడంతో హెండ్రిక్స్ అవుట్ కాలేదు. ఇక తర్వాత బౌలింగ్ కు వచ్చిన అర్షదీప్ సింగ్ మాత్రం ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడనే చెప్పాలి.
టపా టపా వికెట్లు....
అర్ష్దీప్ సింగ్ మొత్తం ఐదు వికెట్లు తీసుకున్నాడు. ప్రధాన బౌలర్లంతా పెవిలియన్ దారి పట్టారు. అర్ష్దీప్ సింగ్ ఐదు వికెట్లు తీసి 37 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక అవేశ్ ఖాన్ కూడా అర్ష్దీప్ సింగ్ కు ఏమాత్రం తీసిపోలేదు. అవేశ్ ఖాన్ 27 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. కులదీప్ యాదవ్ కూడా వికెట్ తీశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఫెలుక్వాయో మాత్రమే 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక తర్వాత 117 పరుగుల లక్ష్యంతో ఇండియా బరిలోకి దిగింది. 23 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఏడు ఓవర్లకు గాను ఇండియా స్కోరు 36 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.
Next Story