Wed Jan 21 2026 09:13:05 GMT+0000 (Coordinated Universal Time)
దుమ్మురేపిన భారత్ బ్యాటర్లు
మహిళ ప్రపంచకప్ పోటీల్లో భారత్ బ్యాటర్లు రాణించారు. దీంతో సెమీస్ ఆశలు కొంత మెరుగుపడినట్లే అనుకోవాల్సి ఉంటుంది.

మహిళ ప్రపంచకప్ పోటీల్లో భారత్ బ్యాటర్లు రాణించారు. దీంతో సెమీస్ ఆశలు కొంత మెరుగుపడినట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచిందనే చెప్పాలి.
బౌలర్లు రాణిస్తే....
భారత్ బ్యాటింగ్ లో స్మృతి మందన 71 పరుగులు, మిథాలి రాజ్ 68, షఫాలి వర్మ53 పరుగులు చేశారు. ఇక ప్రస్తుతం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు 16 ఓవర్లలో 86 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు రాణిస్తే నేరుగా సెమీస్ చేరుకునే అవకాశాలున్నాయి.
Next Story

