Sun Mar 22 2026 02:21:02 GMT+0530 (India Standard Time)
పాక్ పై భారత్ ఘన విజయం
ప్రపంచ కప్ వన్డే మహిళల క్రికెట్ లో భారత జట్టు పాకిస్థాన్ పై అఖండ విజయం సాధించింది

ప్రపంచ కప్ వన్డే మహిళల క్రికెట్ లో భారత జట్టు పాకిస్థాన్ పై అఖండ విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 244 పరుగులు చేసింది. ఏడు వికెట్లను కోల్పోయింది.
వికెట్లు టపా...టపా
ఆ తర్వాత బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఛేజింగ్ లో స్కోర్ చేయలేక చేతులెత్తేసింది. 137 పరుగులకే ఆల్ అవుట్ అయింది. పాక్ ఓపెనర్ సిద్రా అమీన్ ఒక్కరే 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత్ బౌలర్లలో రాజేశ్వరి నాలుగు, ఝలన్ గోస్వామి, స్నేహ్ చెరి రెండు వికెట్లు తీశారు. మహిళల వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై టీం ఇండియా గెలిచి మంచి ప్రారంభాన్ని ఇచ్చింది.
Next Story

