Sat Mar 07 2026 16:17:59 GMT+0530 (India Standard Time)
Breaking : దూసుకెళుతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు
ఆసియన్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు దూసుకుపోతున్నారు. పతకాల పట్టికలో దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారు

ఆసియన్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు దూసుకుపోతున్నారు. పతకాల పట్టికలో దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. పతకాల పట్టికలో భారత్ ఇప్పటికే నాలుగో స్థానంలో ఉంది. ప్రతి రోజూ భారత్ క్రీడాకారులు స్వర్ణం, రజిత పతకాలను సాధిస్తూ దేశ ప్రతిష్గను క్రీడా పటంలో ముందు నిలుపుతున్నారు. తాజాగా ఈరోజు కూడా మరో రెండు స్వర్ణ పతకాలు భారత్ కు దక్కాయి.
పతకాల పట్టికలో...
జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం లభించింది. పురుషుల 4 + 400 మీటర్ల రిలే పరుగులోనూ భారత్ కు స్వర్ణ పతకం దక్కింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 81కు చేరుకుంది. ఇప్పటికే భారత్ 18 స్వర్ణ పతకాలు, 31 రజిత పతకాలు, 31 కాంస్య పతకాలు సాధించి టాప్ 5 లో నిలిచింది. పతకాలు తెచ్చిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
Next Story

