Fri Dec 05 2025 17:15:35 GMT+0000 (Coordinated Universal Time)
భారీ విజయాన్ని నమోదు చేసిన టీం ఇండియా
భారత్ రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది.

భారత్ రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్ డ్రాగా ముగియడంతో నిరాశతో ఉన్న టీం ఇండియా రెండో టెస్ట్ లో ప్రతీకారం తీర్చుకుంది. ఈ టెస్ట్ లో టీం ఇండియా 372 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. న్యూజిలాండ్ జట్టు కేవలం 165 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇప్పటికే టీ 20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ టెస్ట్ సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది.
రెండు ఇన్నింగ్స్ లోనూ....
భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 276 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులకే ఆల్ అవుట్ కావడం భారత్ కు కలసి వచ్చింది. రెండో ఇన్నింగ్స్ లోనూ మెరుగైన ప్రతిభ చూపించకవపోవడంతో న్యూజిలాండ్ జట్టు చతికల పడింది.
Next Story

