Tue Dec 16 2025 02:28:21 GMT+0000 (Coordinated Universal Time)
శభాష్ సూర్య.. టీం ఇండియాదే గెలుపు
రెండో టీ 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది

రెండో టీ 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడటంతో టీం ఇండియాకు విజయం చేకూరింది. భారత్ ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లోనూ రాణించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే ఎప్పటిలాగానే రిషబ్ పంత్ వెంటనే అవుట్ కావడంతో సూర్య క్రీజ్ లోకి దిగాడు. అప్పటి నుంచి భారత్ కు పరుగుల వరద లభించింది. సూర్యకుమార్ యాదవ్ 111 పరుగులు చేశాడు. అందులో ఏడు సిక్స్ లు 11 ఫోర్లు ఉన్నాయి.
భారత్ బ్యాటర్లలో...
భారత్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 36 పరుగులు అధికంగా చేశాడు. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో న్యూజిలాండ్ విఫలమయింది. స్పిన్నర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలకు తోడు మహ్మద్ సిరాజ్, భువనేశ్వరకుమార్, అర్షదీప్ సింగ్ లు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 126 పరుగులకే ఆల్ అవుట్ అయింది. విలియమ్సన్ ఒక్కడే 61 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ విజయం ముందుగానే తేలిపోయింది. మూడో వన్డే ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఇందులో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.
- Tags
- india
- new aealand
Next Story

