Wed Mar 18 2026 22:23:20 GMT+0530 (India Standard Time)
తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 222 పరుగుల తేడాతో టీం ఇండియా బంపర్ విక్టరీ సాధించింది.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 222 పరుగుల తేడాతో టీం ఇండియా బంపర్ విక్టరీ సాధించింది. మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ను ముగించేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 574 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక 174 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడంతో ఫాలో ఆన్ ఆడించింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లోనూ 178 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
మూడు రోజుల్లోనే.....
దీంతో మూడు రోజుల్లో ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ దే పై చేయి అయింది. టెస్ట్ మ్యాచ్ చివరి రోజైన మూడో రోజు ఒక్కరోజే 16 వికెట్లు పడ్డాయి. రవీంద్రా జడేజాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. 175 పరుగులు చేయడమే కాకుండా 9 వికెట్లు తీసుకున్న జడేజా భారత్ విజయంలో కీలక పాత్రను పోషించాడు.
Next Story

