Sat Dec 06 2025 00:52:33 GMT+0000 (Coordinated Universal Time)
తొలి టెస్ట్ భారత్ దే
తొలి టెస్ట్ లో భారత్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఐదో రోజు యాభై నిమిషాల్లోనే ఆట ముగిసింది

తొలి టెస్ట్ లో భారత్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఐదో రోజు యాభై నిమిషాల్లోనే ఆట ముగిసింది.188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ 1-0 తో సిరీస్ లో ఆధిక్యతలో ఉంది. టీం ఇండియా టార్గెట్ విధించిన 513 పరుగులను బంగ్లా బ్యాటర్లు ఛేదించలేక పోయారు. టార్గెట్ చేధించే క్రమంలో 324 పరుగులకే బంగ్లాడదేశ్ ఆల్ అవుట్ అయింది.
ఉదయం ప్రారంభం కాగానే...
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 404 పరుగులు ఆల్ అవుట్ అయింది. బంగ్లాదేశ్ 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆరు వికెట్ల కోల్పోయింది. ఐదో రోజు ఆట ప్రారంభమయిన గంటకే బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది. దీంతో తొలి టెస్ట్ మ్యాచ్ ను భారత్ గెలిచింది. వన్డే సిరీస్ ను కోల్పోయి భారత్ కు ఈ విజయం ఊరట కల్గించేదే.
- Tags
- india
- bangladesh
Next Story

