Sun Mar 15 2026 04:26:18 GMT+0530 (India Standard Time)
ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం
ఒలింపిక్స్ లో భారత్ మరో పతాన్ని సాధించింది. మనుబాకర్, సరబ్ జోత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది

ఒలింపిక్స్ లో భారత్ మరో పతాన్ని సాధించింది. మనుబాకర్, సరబ్ జోత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. మిక్స్డ్ ఈవెంట్ లో ఈ పతకం లభించింది. ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించిన మనుబాకర్ రికార్డు సృష్టించింది.
వరస పతకాలతో...
మనుబాకర్ వరసగా పతకాలను సాధించడంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. వరసగా పతకాలు సాధిస్తూ భారత కీర్తి ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేలా మనుబాకర్ ఆటతీరు సాగుతుందని పలువురు అభినందిస్తున్నారు. మరో పతకాన్ని సాధించడంతో మనుబాకర్ పై అభినందనల వెల్లువలు ఎత్తుతున్నాయి.
Next Story

