Sat Dec 06 2025 09:17:41 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన భారత్... తొలుత ఫీల్డింగ్
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య విశాఖలో జరుగుతున్న మూడో వన్డే లో భారత్ టాస్ గెలిచింది

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య విశాఖలో జరుగుతున్న మూడో వన్డే లో భారత్ టాస్ గెలిచింది. టాస్ గెలుచుకున్న భారత్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ మూడు వన్డే సిరీస్ లలో రెండు వన్డేలలో టాస్ భారత్ కోల్పోయింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో బౌలర్లపై వత్తిడి మరింత పెరిగింది. ఇక విశాఖలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలవడంతో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ కు దిగనుంది.
తొలుత బ్యాటింగ్ కు...
విశాఖ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామమని చెబుతున్నారు. అయితే గణాంకాలు చూస్తే మాత్రం విశాఖ స్టేడియంలో భారత్ కు ఎక్కువ విజయాలున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందన్నదిచూడాలి. అయితే ఈ సిరీస్ లో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో సిరీస్ ఎవరి సొంతమవుతుందన్నది తేలనుంది. భారత బౌలర్లు వెనువెంటనే వికెట్లు తీసి దక్షిణాఫ్రికాపై వత్తిడి పెంచాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
Next Story

