Sat Dec 13 2025 22:35:54 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia : చివరి మ్యాచ్ వర్షార్షణం.. అయినా సిరీస్ భారత్ దే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ భారత్ పరం అయింది. ఈ సిరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది. బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా దిగిన అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ లు దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో మోత పుట్టించారు.
దూకుడుతో ఆడి...
4.5 ఓవర్లు ఆడిన భారత జట్టు 52 పరుగులు చేసింది. టీం ఇండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ కేవలం పదమూడు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచారు. అయితే అభిషేక్ శర్మ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్ లను ఆసీస్ ఆటగాళ్లు మిస్ చేశారు. దీంతో అభిషేక్ శర్మ కు లైఫ్ దొరికినట్లయింది. ఇక శుభమన్ గిల్ కూడా బ్యాట్ తో విజృంభించాడు. కేవలం పదహారు బంతుల్లోనే 29 పరుగులు చేశఆడు. ఇద్దరూ నాటౌట్ గా ఉన్న సమయంలో 4.5 ఓవర్ల వద్ద వర్షం పడింది.
మ్యాచ్ ను ప్రారంభించాలనుకున్నా...
వర్షం పడటంతో మ్యాచ్ ను కొద్దిసేపు అంపైర్లను నిలిపేశారు. అయితే ఎంతసేపటికీ వర్షం తెరపివ్వకపోవడంతో చివరకు అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతోనే అంపైర్లు రద్దు చేయడంతో భారత్ 2-1 సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ ఆరంభంలోనే దూకుడుగా ఆడటం 4.5 ఓవర్లలోనే యాభై పరుగులకు పైగానే చేయడంతో ఇరవై ఓవర్లకు రెండు వందల పరుగులు దాటుతుందన్న అంచనాలు వినపడ్డాయి. అయితే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అభిషేక్ శర్మ ఎంపికయ్యారు.
Next Story

