Fri Dec 05 2025 20:25:45 GMT+0000 (Coordinated Universal Time)
Ind Vs Eng : పట్టు బిగిస్తున్న భారత్... ఈరోజు మనదైతే మన చేతుల్లోకే
ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న బర్మింగ్ హామ్ రెండో టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తుంది.

ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న బర్మింగ్ హామ్ రెండో టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తుంది. ప్రస్తుతానికి భారత్ పటిష్టమైన స్థితిలోనే ఉంది. ఇంగ్లండ్ ను దారుణంగా మనోళ్లు దెబ్బతీశారు. 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను జేమీ స్మిత్, బ్రూక్స్ ఆదుకున్నారు. ఇద్దరూ కలసి సెంచరీలు సాధించడంతో ఒకింత ఇంగ్లండ్ కు ఊరట దక్కింది. అయినా భారత్ కంటే ఇంగ్లండ్ 244 పరుగుల వెనక బడి ఉంది. నాలుగో రోజు కనుక ఆటపై మనోళ్లు పట్టుబిగించి త్వరగా అవుట్ చేయగలిగితే ఈ మ్యాచ్ మనకు అందినట్లేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
407 పరుగులకు ఇంగ్లండ్ ఆల్ అవుట్...
ఇంగ్లండ్ 407 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. సిరాజ్ ఆరు వికెట్లు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులు చేయడంతో ఆధిక్యం కొనసాగుతుది. జేమీ స్మిత్ 184 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం, హ్యారీ బ్రూక్ 158 పరుగులు చేయడం ఇంగ్లండ్ కు కలసి వచ్చింది. ఒక దశలో ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను చూసి ఫాలో ఆన్ తప్పదని అనిపించినా హ్యారీ బ్రూక్, జేమ్ స్మిత్ ఇంగ్లండ్ ను ఆదుకున్నారు. సిరాజ్, ఆకాశ్ దీప్ లు మాత్రం ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడారు.
భారత్ రెండో ఇన్నింగ్స్ లో...
ఇక ఇంగ్లండ్ ఆల్ అవుట్ అయిన వెంటనే భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను ప్రాంరభించింది. యశస్వి జైశ్వాల్ 28 పరుగులు చేసి టంగ్ బౌలింగ్ లో ఎల్.బి. డబ్ల్యూ గా అవుటయి వెనుదిరిగాడు. ప్రస్తుతం కే ఎల్ రాహుల్ 28 పరుగులతో క్రీజులో ఉండగా, కరుణ్ నాయర్ ఏడు పరుగులతో ఉన్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో పదమూడు ఓవర్లు ఆడి ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేయగలిగింది. ఈరోజు బ్యాటర్లు నిలదొక్కుకుని భారీస్కోరును ఇంగ్లండ్ ముందు ఉంచగలిగితే మ్యాచ్ మన చేతిలోకి దాదాపు వచ్చినట్లే. అయితే ఏం జరుగుతుందన్నది ఈరోజు చూడాల్సి ఉంది.
Next Story

