Fri Mar 20 2026 02:04:41 GMT+0530 (India Standard Time)
India Vs South Africa : నేడు ఇండియా - దక్షిణాఫ్రికా రెండో టీ 20
నేడు భారత్ మరో టీ20కి సిద్ధమవుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్ లో నేడు తలపడనుంది.

నేడు భారత్ మరో ట20కి సిద్ధమవుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్ లో నేడు తలపడనుంది. తొలి మ్యాచ్లో గెలిచి ఊపుమీదున్న భారత్ రెండో మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. రెండో మ్యాచ్ లో అయినా గెలిచి దక్షిణాఫ్రికా టీ 20లలో తమ ఆటతీరు తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్ కీలకంగా మారింది. తొలి మ్యాచ్ లో భారీ విజయాన్ని సాధించిన భారత్ రెండో మ్యాచ్ లోనూ అదే తరహా ఆట కొనసాగించాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటుున్నారు.
రెండో టీ 20లోనూ...
సంజూ శాంసన్ తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించడంతో భారత్ రెండు వందలకు పైగా పరుగులు సాధించగలిగింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విజయం సులువుగా మారింది. రెండో టీ 20 మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. దక్షిణాఫ్రికాను కూడా తీసిపారేయలేని పరిస్థితి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఊపుమీదుంది. దీంతో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ జరిగే గెబహా స్టేడియం పిచ్ పేసర్లకు అనుకూలం కావడంతో మరి ఎవరిది పై చేయి అన్నది చూడాల్సి ఉంది.
Next Story

