Sat Dec 06 2025 09:16:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు న్యూజిలాండ్ తో భారత్ ఆఖరి టీ 20
న్యూజిలాండ్ తో భారత్ నేడు మూడో టీ 20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.

న్యూజిలాండ్ తో భారత్ నేడు మూడో టీ 20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది. మూడు టీ 20లలో ఒక మ్యాచ్ వర్షం కురవడంతో రద్దయింది. రెండో మ్యాచ్ లో మాత్రం భారత్ భారీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను గెలుచుకోవాలని టీం ఇండియా భావిస్తుంది. రెండో టీ 20 లో 65 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది.
మార్పులు లేకుండానే...
భారత్ ఈ మ్యాచ్ లో ఓడినా సిరీస్ సమంగా మారుతుంది. పెద్దగా మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగుతుంది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తేనే ఈ మ్యాచ్ సొంతమవుతుంది. న్యూజిలాండ్ కూడా ఓటమి కసితో రగలి పోతుంది. ఈ మ్యాచ్ లో గెలవాలని భావిస్తుంది. అందుకు కొద్దిగా మార్పులు చేసే అవకాశముందని తెలిసింది. మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Tags
- india
- new zealand
Next Story

