Fri Dec 05 2025 13:57:03 GMT+0000 (Coordinated Universal Time)
వెయ్యో మ్యాచ్ లో భారీ స్కోర్ దిశగా
భారత్ నేడు అరుదైన వన్డే మ్యాచ్ ను ఆడనుంది. వెస్టండీస్ తో ఈరోజు జరిగే వన్డే భారత్ కు వెయ్యోది.

భారత్ నేడు అరుదైన వన్డే మ్యాచ్ ను ఆడనుంది. వెస్టండీస్ తో ఈరోజు జరిగే వన్డే భారత్ కు వెయ్యోది. వెయ్యి వన్డేలు ఈ మ్యాచ్ తో భారత్ ఆడినట్లవుతుంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ - వెస్టండీస్ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ లో భారత్ వెస్టండీస్ తో తలపడనుంది. మ్యాచ్ కు ముందు శిఖర్ ధావన్ కరోనా బారిన పడటంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్ లు దిగనున్నారు.
పిచ్ బ్యాటింగ్ కు....
విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్ లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. వెస్టండీస్ కూడా పొలార్డ్ నేతృత్వంలో యువ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయి.
- Tags
- india
- west indies
Next Story

