Wed Mar 18 2026 23:56:30 GMT+0530 (India Standard Time)
జడేజా సెంచరీ.. భారీ స్కోరు దిశగా
శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ భారీ స్కోరు దిశగా వెళుతుంది. ఏడు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది.

ఇండియా - శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ భారీ స్కోరు దిశగా వెళుతుంది. రెండో రోజు భోజన విరామ సమయానికి 468 పరుగులు చేసింది. 357 ఓవర్ నైట్ స్కోరుతో ఈరోజు భారత్ ఆట ప్రారంభించింది. ఏడు వికెట్లను కోల్పోయిన భారత్ 468 పరుగులు పూర్తి చేసింది. రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేశారు. 102 పరుగులు చేసిన జడేజా ఇంకా క్రీజ్ లోనే ఉన్నారు.
ఏడు వికెట్లు కోల్పోయి...
మరోవైపు జయంత్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు. రవిచంద్ర అశ్విన్ కూడా 56 పరుగులు చేయడం విశేషం. ఒక ఓవర్ లో జడేజా రెండు ఫోర్లు కొట్టి జట్టు స్కోరును 400 దాటించేశారు. శ్రీలంక బౌలర్లు ఈ సెషన్ లో ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగారు. అదీ సురంగ లక్మల్ బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ అవుటయ్యాడు.
Next Story

