Sun Dec 14 2025 00:22:38 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Westindies t : కరేబియన్ ఆటగాళ్లు నిలదొక్కుకున్నారే.. మనోళ్ల చేయి తిరగలేదా?
తొలి టెస్ట్ లో విఫలమయిన వెస్టిండీస్ బ్యాటర్లు రెండో టెస్ట్ లో మాత్రం కాస్త నిలకడగా ఆడుతున్నారు.

తొలి టెస్ట్ లో విఫలమయిన వెస్టిండీస్ బ్యాటర్లు రెండో టెస్ట్ లో మాత్రం కాస్త నిలకడగా ఆడుతున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఫాల్ ఆన్ లో పడినప్పటికీ ఓటమి నుంచి తమ జట్టును తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ బౌలర్లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా కొంత నిలకడగా ఆడుతూ ఈ టెస్ట్ ను డ్రా చేసే ప్రయత్నంలో విండీస్ ఆటగాళ్లు ఉన్నట్లు కనపడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 140 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టు మూడో రోజు 248 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కులదీప్ యాదవ్ ఐదు వికెట్లు తీశాడు. దీంతో ఫాలో ఆన్ నుంచి మాత్రం విండీస్ తప్పించుకోలేక పోయింది.
ఫాలో ఆన్ తర్వాత...
భారత జట్టుపై ఫాలోఆన్ తర్వాత విండీస్ బ్యాటర్లు మూడో రోజు చివరికి నిలకడగా రాణించారు. జాన్ క్యాంప్‌బెల్ 87 పరుగులు చేసి అద్భుత ప్రతిఘటన ప్రదర్శించగా, షాయ్ హోప్ 66 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచి 138 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దీంతో విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు రెండు వికెట్లను మాత్రమే చేజార్చుకుంది. ఈ మ్యాచ్ సిరీస్‌లో విండీస్‌కు ఇవే తొలి అర్ధశతకాలు కావడం విశేషం. భారత్‌పై ఇన్నింగ్స్ తేడాతో ఓటమి నివారించాలంటే విండీస్ ఇంకా 97 పరుగులు చేయాలి. భారత్ విజయం దాదాపు ఖాయమని అనుకుంటున్న సమయంలో ఈ ఇద్దరి జోడీ భారత్ విజయానికి బ్రేకులు వేసేటేట్లు కనపడుుంది.
మూడో రోజు ఆట ముగిసే టైంకి...
మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీం ఇండియా కంటే ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. రెండు వికెట్లు వెంట వెంటనే పడినా జాన్ క్యాంప్ బెల్, షైయ్ హోప్ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట 138 మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఈ మ్యాచ్ పై భారత్ పట్టు కొత తగ్గినట్లే కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో విజృంభించిన భారత బౌలర్లు తర్వాత మాత్రం వికెట్లను వెంటవెంటనే తీయడంలో కొంత వెనకబడటంతో ఈ రోజు ఆటపై విజయమా? లేదా? అన్నది తెలియనుంది.
Next Story

