Fri Feb 27 2026 09:41:31 GMT+0530 (India Standard Time)
India vs Zimbabwe : అందరూ ఆడారు... ఆడితే అంతే...జింబాబ్వేపై భారత్ ఘన విజయం
టీం ఇండియా జింబాబ్వేపై విజయం సాధించింది

తప్పక గెలవాల్సిన సూపర్–8 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. అభిషేక్ శర్మ అర్ధశతకం, హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 4 వికెట్లకు 256 పరుగులు చేసి టోర్నీలో తన సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 72 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. ఇది టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌కు ఇప్పటివరకు ఉన్న అత్యధిక స్కోరు. ఈ వరల్డ్ కప్ లో కూడా ఇదే అత్యధికం.బౌలింగ్ కొంత బలహీనంగా కనిపించింది. బ్యాటింగ్ లో మాత్రం మనోళ్లు అదరగొట్టారు. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్స్ కు చేరింది. భారత్, వెస్టిండీస్ చెరి రెండు పాయింట్లతో ఉన్నాయి. మార్చి ఒకటో తేదీన కోల్‌కతాలో ఈ రెండు జట్లు తలపడనున్న మ్యాచ్ నాకౌట్‌లా మారింది. మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్ గా హర్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు.
76 పరుగులతో విజయం...
దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన తర్వాత భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఆ పరిస్థితిలో అభిషేక్ శర్మ 30 బంతులలో 55 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. అభిషేక్ మళ్లీ ఫామ్ లోకి రావడం శుభపరిణామం. హార్దిక్ పాండ్యా 23 బంతులలో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లున్నాయి. తిలక్ వర్మ కూడా 16 బాల్స్ లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లున్నాయి. ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు. దీంతో స్కోరు భారీగా పెరిగింది. భారత్ ఇరవై ఓవర్లలో 256 పరుగులు చేయగలిగింది. రన్ రేట్ కావాలనుకుంటున్న సమయంలో ఈ రేంజ్ లో స్కోరు చేసి భారత్ భళా అని అనిపించంది.
ఛేజింగ్ లో తడబడి...
జింబాబ్వే ఛేజింగ్ లో కొంత తడబడింది. ఆరు వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 59 బంతుల్లో 97 నాటౌట్‌తో పోరాడినా ఫలితం మారలేదు. శివమ్ దూబే వేసిన ఓ ఓవర్లో 26 పరుగులు సాధించి తన శక్తిని చూపించాడు.జింబాబ్వే ఫీల్డింగ్ లో లోపం కనిపించింది. లోపించింది. కిషన్ 26, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్‌లు వదిలేశారు. అయితే మపోసా బౌలింగ్‌లో రజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ అవుటయ్యాడు.భారీ లక్ష్యాన్ని కాపాడడంలో బౌలర్లు కచ్చితంగా బౌలింగ్ చేశారు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి ఇరవై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో సెమీ ఫైనల్స్ ఆశను భారత్ సజీవంగా నిలుకున్నట్లయింది. ఆదివారం జరిగే మ్యాచ్ కీలకం కానుంది. వెస్టిండీస్ పై ఇదే రీతిలో పోరాడాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Next Story

