Sun Feb 15 2026 20:10:12 GMT+0530 (India Standard Time)
India vs Pak T20 World Cup : టాస్ గెలిస్తే ఏంటి? పిచ్ రిపోర్ట్ విన్నారంటే?
టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కొలొంబో వేదికగా మరికాసేపట్లో జరగననుంది

దాయాదుల పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది.పాకిస్తాన్ - ఇండియా మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కొలొంబో వేదికగా మరికాసేపట్లో జరగననుంది. అయితే ఇందులో టాస్ కీలకంగా మారనుంది. అయితే గణాంకాలు కూడా అవే చెబుతున్నాయి. ఇప్పటి వరకూ టీ20 మ్యాచ్ లలో పాక్ - ఇండియా జట్లు పదహారు తలపడగా అందులో పదమూడింటిలో భారత్ విజయం సాధించింది. మూడింటిలో పాక్ గెలిచింది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే టాస్ గెలుచుకున్న జట్లు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటాయి. ఛేజింగ్ చేసిన జట్లు ఎక్కువ సార్లు గెలిచాయి. అయితే ఇది టీ20 మ్యాచ్ లకే పరిమితం. కొలొంబో స్టేడియానికి కాదు. అందుకే టాస్ ఈ మ్యాచ్ లో కీలకంగా మారనుంది.
తక్కువ స్కోర్లు...
పాకిస్తాన్ కొలొంబో మైదానంలో ఇప్పటికే అనేక మ్యాచ్ లు ఆడింది. దానికి ఆ గ్రౌండ్ పరిస్థితి తెలుసు. భారత్ కొలొంబోకు వచ్చి ప్రాక్టీస్ చేసింది. ప్రేమదాస స్టేడియంలో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన పాక్ తమకు సానుకూలంగా ఉంటుందన్న విశ్లేషణు కూకడా ఉన్నాయి. అయితే భారత్ - పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ లలో అత్యధిక స్కోర్లు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ ఎక్కువ స్కోరు నమోదయింది కేవలం 159 పరుగులే. ఇరవై పరుగులకు 159 పరుగులు చేయడమే ఇరు జట్ల మధ్య అతి ఎక్కువ. ఇక అత్యల్ప స్కోరు 118 గా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ టాస్ తో సంబంధం లేకుండా నిలదొక్కుకుని ఎక్కువ పరుగులు చేసిన వారు గెలిచిన సందర్భాలు కూడా లేకపోలేదు.
లెక్కలు ఇలా ఉంటే?
మరొకవైపు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్ లో 160 పరుగులు చేసిన జట్టుకు కొంత విజయావకాశాలు ఉంటాయని క్రీడానిపుణులు, లెక్కలు చెబుతున్నాయి. అంతకు మించి చేస్తే ఏ జట్టైనా ఆచి తూచి ఆడుతూ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి ఆడాల్సి ఉంటుంది. కానీ ప్రేమదాస స్టేడియంలో మాత్రం తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఎక్కువగా ఈ వరల్డ్ కప్ లో గెలవడం విశేషం. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఇరు జట్లు స్పినర్లతోనే బరిలోకి దిగుతున్నాయి. పాక్ నలుగురు, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. కొలొంబోలో మాత్రం టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశముంది. ఇక అభిషేక్ శర్మ అరగంట ఉంటే చాలు పాక్ కు చుక్కలతో పాటు లెక్కలు కూడా భారత్ కు అనుకూలంగా మారనున్నాయి.
Next Story

