Sun Feb 15 2026 19:52:54 GMT+0530 (India Standard Time)
T20 World Cup : పసికూనపై భారత్ ఘన విజయం.. ఇదే దూకుడు కొనసాగిస్తే?
ఢిటీ20 వరల్డ్ కప్ లో నమీబియాపై భారత్ ఘన విజయం సాధించింది.

ఢిల్లీ టీ20 వరల్డ్ కప్ లో నమీబియాపై భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ ఆడకపోయినా.. మంచి స్కోరు సాధించింది. టాస్ గెలిచిన నమీబియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా దిగారు. సంజూ శాంసన్ ఉన్న కాసేపు సిక్సర్లతో స్టేడియాన్ని మోత పుట్టించాడు. ఇక ఇది ఇషాన్ కిషన్ టైమ్ అని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్ లో ఉండటంతో అతనిని ఆపడానికి ఏ జట్టు బౌలర్ కు సాధ్యం కావడం లేదు. నమీబియాను భారత్ చిత్తుగా ఓడించింది.
93 పరుగుల తేడాతో...
ఢిల్లీ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ పతనంతో నమీబియా కోలుకోలేకపోయింది. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లకు 21 పరుగులు ఇచ్చాడు. శివమ్ దూబే కూడా కీలక సమయంలో మద్దతు ఇచ్చాడు. చివరి వికెట్‌గా జేన్ గ్రీన్ 11 పరుగులు చేసి అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వెళ్లింది.
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్...
టాస్ గెలిచిన నమీబియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఇషాన్ కిషన్ శరవేగ ఆరంభం ఇచ్చాడు. 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. సంజు శాంసన్ 22 పరుగులతో తోడ్పాటునిచ్చాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో నమీబియా బౌలర్లు పట్టు సాధించారు. ఆ దశలో ఐదు వికెట్లు తీసి కేవలం 41 పరుగులే ఇచ్చారు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. జేజే స్మిట్ ఒక వికెట్ పడగొట్టినా 50 పరుగులు ఇచ్చాడు. చివరి ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ 2 పరుగులకే రన్ అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు.
లక్ష్య ఛేదనలో ...
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో జాగ్రత్తగా ఆడింది. లౌరెన్ స్టీంక్యాంప్, జాన్ ఫ్రైలింక్ జోడీ తొలి వికెట్‌కు 15 పరుగులు జోడించింది. ఫ్రైలింక్ 22 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చాడు. స్టీంక్యాంప్ 20 బంతుల్లో 29 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మధ్య ఓవర్లలో వికెట్లు వరుసగా పడటంతో నమీబియా 88 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. భారత్ తరఫున అక్సర్ పటేల్ కీలక వికెట్లు తీశాడు. బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచాడు. పాకిస్తాన్ తో ఆదివారం భారత్ కొలొంబో వేదికగా మ్యాచ్ ఆడనుంది.
Next Story

