Sat Dec 06 2025 01:51:42 GMT+0000 (Coordinated Universal Time)
బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ బుమ్రా.. ఏ ఛానల్, యాప్ లో మ్యాచ్ చూడొచ్చంటే
జస్ప్రీత్ బుమ్రా భారతజట్టుకు దూరమై దాదాపు 11 నెలలు అవుతోంది

జస్ప్రీత్ బుమ్రా భారతజట్టుకు దూరమై దాదాపు 11 నెలలు అవుతోంది. ఇప్పుడు ఏకంగా జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ చేశారు. శుక్రవారం నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్లో బుమ్రా ఫిట్నెస్ మీద అభిమానులు దృష్టి పెట్టారు. అతడు రాణించి.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఆసియా కప్, వరల్డ్ కప్ ముందు అతడి ప్రదర్శన మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఐర్లాండ్పై ఈ సిరీస్ లో భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నాడు.
మొదటి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన బుమ్రా బౌలింగ్ ను ఎంచుకున్నాడు. డబ్లిన్లోని ది విలేజ్లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7:30 కు మొదలవ్వనుంది. ఇండియా vs ఐర్లాండ్ సిరీస్ భారతదేశంలోని వయాకామ్ 18 యాజమాన్యంలోని స్పోర్ట్స్ 18 ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. భారతదేశంలో JioCinema యాప్లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
మొదటి టీ20 మ్యాచ్ లో భారత ప్లేయింగ్ లెవెన్ ఇదే: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(c), రవి బిష్ణోయ్
Next Story

