Fri Mar 06 2026 09:30:52 GMT+0530 (India Standard Time)
India Vs England : టీం ఇండియా ఫైనల్ చేరడానికి ఈ ముగ్గురు కారణం ఎవరైనా కాదంటారా?
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు ముగ్గురు గేమ్ ఛేంజర్స్ గా నిలిచారు

వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు ముగ్గురు గేమ్ ఛేంజర్స్ గా నిలిచారు. టీం ఇండియా గెలిచిందంటే ఆ ముగ్గురే కారణమని చెప్పక తప్పదు. ఆ ముగ్గురి వల్లనే టీం ఇండియా ఫైనల్స్ కు చేరింది. అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్ భారత్‌కు కీలక విజయాన్ని అందించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఇంగ్లండ్‌పై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై ఇండియా విజయం సాధించి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంతో మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఆపద్భాంధవుడు సంజూ...
సంజూ శాంసన్ : సంజూ శాంసన్ జట్టుకు కష్టకాలంలో అంది వచ్చాడు. సెమీ ఫైనల్స్ లోకి, ఫైనల్స్ లోకి రావడానికి సంజూయే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లుగా దిగిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లో ఆరంభంలో అదిరేటి ప్రారంభాన్ని అందిస్తారనుకుంటే అభిషేక్ అవుటవుతున్నాడు.అయినా సంజూ ఎక్కడా సంయమనం కోల్పోకుండా జట్టును గెలుపు దిశగా పయనింపంచేయడంలో అద్భుతమైన ప్రతిభను చూపాడు. దక్షిణాఫ్రికాపైన కూడా ఒంటరి పోరాటం చేసిన సంజూ అదే పంథాను సెమీ ఫైనల్స్ లోనూ కొనసాగించాడు. ఒత్తిడి మధ్య 89 పరుగులు చేసి టీం ఇండియా 253 పరుగులు చేయగలిగిందంటే అందరి భాగస్వామ్యం ఉన్నా అందులో సంజూ స్పెషాలిటీతోనే సాధ్యమయింది.
కళ్లు చెదిరే క్యాచ్ లు...
అక్షర్ పటేల్ : ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లో అక్షర్ పటేల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.అద్భుతమైన క్యాచ్ లను పట్టి టీం ఇండియా విజయానికి ప్రధాన కారణమయ్యాడు. ప్రమాదకరమైన ఇంగ్లీష్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చడంలో అక్షర్ పటేల్ అద్వితీయమైన ప్రదర్శనేనని చెప్పాలి. కీలక సమయంలో అక్షర్ పటేల్ చేసిన ఫీల్డింగ్ ప్రయత్నాలు మ్యాచ్ గమనాన్ని మార్చాయి. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జస్ప్రీత్ బుమ్రా వేసిన నెమ్మదైన బంతిని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రుక్ సరిగ్గా టైమ్ చేయలేక కవర్లపైకి ఎత్తాడు. బంతిపై కళ్లుపెట్టిన అక్షర్ వెనక్కి పరుగెత్తి, సరైన సమయానికి ముందుకు దూకుతూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో స్టేడియంలో ఉత్సాహం వెల్లివిరిసింది. భారత్‌కు తొలివికెట్ లభించింది. తర్వాత లక్ష్యానికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్న విల్ జాక్స్ షాట్‌ను డీప్ పాయింట్ వైపు కొట్టాడు. బంతిని వెంబడిస్తూ అక్షర్ పరుగెత్తి పట్టుకున్నాడు. బౌండరీ వద్ద సమతుల్యం కోల్పోయే సమయంలో బంతిని మైదానంలోకి తిరిగి విసిరాడు. అక్కడ ఉన్న శివమ్ దూబే క్యాచ్ పూర్తి చేసి జాక్స్‌ను ఔట్ చేశాడు. అక్షర్ చాకచక్యంతో ఆ వికెట్ సాధ్యమైంది. మ్యాచ్ ప్రారంభంలోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌ను కవర్ వద్ద అక్షర్ సురక్షితంగా పట్టడం కూడా ఇంగ్లండ్‌కు దెబ్బగా మారింది.బ్యాటర్లు ఆధిపత్యం చూపిన ఈ మ్యాచ్‌లో అక్షర్ ఫీల్డింగ్ ప్రత్యేకంగా నిలిచింది. ఒత్తిడి సమయంలో అతడు చూపిన చురుకుదనం భారత్ విజయానికి కీలకంగా మారింది.
బు...బు... బుమ్రా...
జస్పిత్ బుమ్రా : ఈ మ్యాచ్ విజయం సాధించడానికి జస్పత్ బుమ్రా బౌలింగ్ ఎంత ముఖ్యమో మ్యాచ్ చూసిన వారికి అర్థమయి ఉంటుంది. ప్రతి భారత బౌలర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు బాదేస్తున్న సమయంలో జస్ప్రిత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంతే కాదు. చివరి మూడు ఓవర్లలో జస్పత్ బుమ్రా రెండు ఓవర్లు పొదుపుగా వేయడం వల్లనే ఈ మ్యాచ్ విజయం సాధ్యమయిందని చెప్పాలి. జస్పత్ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి కేవలం 33 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అసలు జట్టుకు జస్పత్ బుమ్రా ఎంత బలమో నిన్న సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో నిరూపించాడు. చివరి ఓవర్ లో ఎక్కువ రన్స్ తక్కువ బాల్స్ ఉండటంతో ఆర్చర్ మూడు సిక్సర్లు వరసగా కొట్టగలిగినా విజయం సాధించామంటే అది బుమ్రా వల్లనే సాధ్యం.. అందుకే..స్టేడియం మొత్తం.. బు...బు..బుమ్రా అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది.
Next Story

