Sat Dec 13 2025 22:34:10 GMT+0000 (Coordinated Universal Time)
Inda Vs Australia 3rd One Day : భారత్ గెలుపు అదే టర్నింగ్ పాయింట్
హోబర్ట్ లో ఆస్ట్రేలియాపై ఎట్టకేలకు భారత్ విజయం సాధించింది.

హోబర్ట్ లో ఆస్ట్రేలియాపై ఎట్టకేలకు భారత్ విజయం సాధించింది. అయితే మరోసారి టాప్ ఆర్డర్ కొంత తడబడిందనే చెప్పాలి. శుభమన్ గిల్ ఎప్పటిలాగనే అవుటయ్యాడు. అభిషేక్ శర్మ దూకుడుతో తన వికెట్ ను పొగొట్టుకున్నాడు. తిలక్ వర్మ కూడా ఈ టూర్ లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్ లోనూ అంతే కనిపించించింది. వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ నిలబడకుంటే ఈ మ్యాచ్ కూడా వదులుకోవాల్సి వచ్చేది. కానీ వీరద్దరూ వికెట్లు పడిపోయినా రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ 1 - 1 సమం చేయగలిగింది.
ఐదు వికెట్ల తేడాతో...
టీ20 సిరీస్‌లో భారత్ మంచి స్ఫూర్థిదాయకమైన ప్రదర్శనతో గెలుపొందింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో 187 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఇది ఆస్ట్రేలియాకు నింజా ఓవల్ మైదానంలో తొలి ఓటమి కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తరఫున టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 74 పరుగులు చేసి హిట్టింగ్ ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్లను కోల్పోయి 186 చేయగలిగింది. . అయితే, ఆ తర్వాత భారత్ జట్టు బలమైన బ్యాటింగ్‌తో సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎలిస్ మూడు వికెట్లు తీసి భారత్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టినా చివరికి భారత్ పైచేయి సాధించింది.
వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ కలిసి...
అభిషేక్ శర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (24), తిలక్ వర్మ (29), అక్సర్ పటేల్ (17) తలో భాగస్వామ్యంతో మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే ప్రధాన ఆకర్షణ వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో అజేయంగా 49). అతనితో పాటు జితేశ్ శర్మ (12 బంతుల్లో 22 నాటౌట్) చివర్లో విజయాన్ని అందించారు. సుందర్ కౌ కార్నర్ ప్రాంతంలో ఎక్కువగా సిక్స్‌లు బాదుతూ తన పవర్‌హిట్టింగ్ సామర్థ్యాన్ని చూపించాడు. హేజిల్‌వుడ్ లేకపోవడం కూడా ఆస్ట్రేలియా బౌలింగ్‌లో లోపంగా మారింది. ఎలిస్ తప్ప మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.తదుపరి మ్యాచ్ నవంబర్ 6వ తేదీన గోల్డ్ కోస్ట్‌లో జరుగనుంది. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసి తిరిగి జట్టులో ప్రాధాన్యతను చాటుకున్నాడు. అతడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
బౌలర్లు కట్టడిగా...
ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్‌లను ప్రారంభంలోనే ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే ఆ తర్వాత టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ (39 బంతుల్లో 64) దాడికి దిగడంతో స్కోరు 186కి చేరింది. బుమ్రా, చక్రవర్తిలను కూడా డేవిడ్ సునాయాసంగా ఎదుర్కొన్నాడు. 20 పరుగుల వద్ద సుందర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో లైఫ్ దొరికినట్లయింది. వరుణ్ చక్రవర్తి రెండు వరుస బంతుల్లో మిచెల్ మార్ష్, మిచెల్ ఓవెన్లను ఔట్ చేస్తూ బౌలింగ్‌లో సత్తా చూపాడు. చివర్లో బుమ్రా, అర్ష్‌దీప్‌లు ఆస్ట్రేలియాను అదుపులో ఉంచగలిగారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది.
Next Story

