Fri Dec 05 2025 14:56:52 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : టాస్ గెలుచుకున్న టీం ఇండియా
ఆసియా కప్ లో మరికాసేపట్లో భారత్ - యూఏఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది

ఆసియా కప్ లో మరికాసేపట్లో భారత్ - యూఏఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలివిడత యూఏఈ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఆసియా కప్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్ బలంగా ఉంది. ప్రపంచంలోని అన్ని జట్లలో టీ 20 ఫార్మట్ లలో భారత్ బలమైన జట్టు అందులో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆసియా కప్ ఛాంపియన్ షిప్ బరిలోకి దిగిన టీం ఇండియాకు ఈ మ్యాచ్ కూడా కీలకమనే చెప్పాలి.
పిచ్ ప్రకారం...
అయితే దుబాయ్ పిచ్ ను అనుసరించి తొలుత పిచ్ పేసర్లకు, స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెబుతున్నారు. అంటే టాస్ గెలుచుకున్న జట్టు సహజంగానే ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. తొలి విడత ఫీల్డింగ్ చేసి తక్కువ పరుగులకే ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించడం సులువుగా మారనుంది. అయితే టీ 20 ఫార్మాట్ కావడంతో పాటు యూఏఈలో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉండటంతో పాటు ఇటీవల టీ 20 సిరిసీ ను బంగ్లాదేశ్ పై గెలవడంతో ఉత్సాహంతో ఉన్న జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
Next Story

