Sat Dec 06 2025 02:12:26 GMT+0000 (Coordinated Universal Time)
వికెట్లు టపా... టపా.. శ్రీలంకకు తొలిరోజే?
భారత్ - శ్రీలంక రెండో టెస్ట్ లో బ్యాట్స్ మెన్ లు తడబడుతున్నారు. భారత్ 252 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో అవుటయ్యారు.

భారత్ - శ్రీలంక రెండో టెస్ట్ లో బ్యాట్స్ మెన్ లు తడబడుతున్నారు. భారత్ బ్యాట్స్ మెన్ 252 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో అవుటయ్యారు. కేవలం 59 ఓవర్లకే భారత్ బ్యాట్స్ మెన్ అవుట్ కావడంతో శ్రీలంకకు ఈ టెస్ట్ లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడిందని అనుకున్నారు. కానీ తొలి రోజే భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాట్స్ మెన్ వరసగా పెవిలియన్ దారి పట్టారు. దీంతో తొలి రోజు మాత్రం బౌలర్లదే పైచేయి అయింది.
ఇంకా 166 పరుగులు....
భారత్ 252 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో ఉత్సాహంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. బూమ్రా, షమి బౌలింగ్ ధాటికి వికెట్లు ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయాయి. 14 పరుగులకు మూడు వికెట్లు పడటంతో శ్రీలంక కష్టాల్లో పడినట్లయింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 86 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో తిరిగి ఈ మ్యాచ్ లో భారత్ దే పై చేయి అయ్యే అవకాశం కన్పిస్తుంది. శ్రీలంక ఇంకా భారత్ కంటే 166 పరుగులు వెనుకబడి ఉంది.
Next Story

