Mon Feb 02 2026 18:29:04 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో టీ 20.. ఈ మ్యాచ్ లోనైనా
మరికాసేపట్లో ఇండియా - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ టీ 20లో టాస్ గెలిచి మరోసారి సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.

మరికాసేపట్లో ఇండియా - సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ టీ 20లో టాస్ గెలిచి మరోసారి సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరగనుంది. వరసగా మూడు మ్యాచ్ లలోనూ సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. మూడో మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తుంది. దక్షిణాఫ్రికాకు ఈ టీ 20 మ్యాచ్ 150ది కావడం విశేషం.
ఎటువంటి మార్పులు లేకుండానే....
తొలి రెండు మ్యాచ్ లలో ఓడిన టీం ఇండియా విశాఖపట్నంలో జరిగే మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. విశాఖపట్నం పిచ్ మీద ఇండియా గెలుపు శాతం 77గా ఉందని నిపుణులు చెబుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీం ఇండియా జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
Next Story

