Tue Mar 17 2026 03:37:35 GMT+0530 (India Standard Time)
భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఖరారరయింది. వరల్డ్ కప్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది

భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఖరారరయింది. వరల్డ్ కప్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-పాక్ మ్యాచ్ నిర్వహించే అవకాశాలున్నాయని తెలిసింది. అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ లేటెస్ట్ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ వంటిదే. దాయాదుల పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అక్బోటరు 7న...
అక్టోబరు 7వ తేదీన ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 2023 ఐపీఎల్ ముగిసిన తర్వాత షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. ఇందుకోసం అన్ని దేశాలతో సంప్రదింపులు జరిపి వేదికతో పాటు తేదీ కూడా అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే ముందుగానే వేదిక, తేదీ లీక్ అయ్యాయి.
Next Story

