Tue Feb 10 2026 14:24:36 GMT+0530 (India Standard Time)
India vs Pakistan : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 15న భారత్ - పాక్ మ్యాచ్
భారత్ - పాక్ మధ్య మ్యాచ్ వచ్చే ఆదివారం జరగనుంది

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. భారత్ - పాక్ మధ్య మ్యాచ్ వచ్చే ఆదివారం జరగనుంది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టీ ప్రపంచ కప్ లో ఈ నెల 15వ తేదీన జరిగే మ్యాచ్ ను తాము ఆడబోమని పాక్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సందిగ్దత నెలకొంది. భారత్ తో తమ మ్యాచ్ ను బహిష్కరిస్తామన్న పాక్ నిర్ణయాన్ని ఐసీసీ తీవ్రంగా వ్యతిరేకించింది. హెచ్చరించింది. అయితే ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తమ జట్టు భారత్ తో ఆడుతుందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
చర్చలు ఫలించి...
ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఈ నెల 15వ తేదీన కొలొంబోలో భారత్ - పాక్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ఆడేందుకు పాక్ ప్రభుత్వం అనుమతివ్వడంతో సంక్షోభానికి తెరపడినట్లయింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే అన్ని మ్యాచ్ లు జరగనున్నాయి. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది. భారత్ మాత్రం యధా ప్రకారం కొలొంబో వెళతామనిప్రకటించింది. పాక్ కూడా దిగి రావడంతో ఇక వచ్చే ఆదివారం పాక్ - భారత్ మ్యాచ్ జరుగుతుంది.
షరతులు పెట్టిన పాక్...
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేక షరతులు పెట్టినా ఐసీసీ అంగీకరించలేదు. దీంతో పాటు శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు కూడా పాక్ క్రికెట్ బోర్డును కోరాయి. మూడు షరతులకు ఐసీసీ అంగీకరించకపోయినా క్రీడాపరంగా భారత్ తో తలపడేందుకు భారత్ సిద్ధమవ్వడం శుభపరిణామమే. అయితే భారత్ లో మ్యాచ్ లు ఆడనందుకు మాత్రం బంగ్లాదేశ్ పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. అలాగే భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ విషయంలో కూడా ఐసీసీ తేల్చలేదు. అయినా పాకిస్తాన్ ఎట్టకేలకు దిగి వచ్చిభారత్ తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సిద్ధమయింది.
Next Story

