Fri Dec 05 2025 13:58:37 GMT+0000 (Coordinated Universal Time)
Asia Cup : వత్తిడికి గురి చేద్దామని పాక్ చిత్తుగా ఓడింది.. భారత్ కు తిరుగులేని విజయం
ఆసియా కప్ లో భారత్ కు తిరుగులేదని మరొకసారి నిరూపించింది. టీం ఇండియా జట్టు పాకిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది

ఆసియా కప్ లో భారత్ కు తిరుగులేదని మరొకసారి నిరూపించింది. టీం ఇండియా జట్టు పాకిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ భారత్ తనకు తిరుగులేదని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రత్యర్ధి పాకిస్థాన్ పై ఆధిపత్యం తమదేనంటూ చెప్పేసింది. దుబాయ్ వేదికగా జరిగిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లో టీం ఇండియా మరోసారి విజయం సాధించింది. ఏ ఓవర్ లో చూసినా.. ఓ బంతి చూసినా భారత్ తనకు టీ 20 లలో ఉండే గ్రిప్ అంటే ఏమిటో చెప్పింది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ చేసుకుంది. అదే పాక్ చేసిన మొదటి తప్పు. ఎక్కువ పరుగులు లక్ష్యంగా పెట్టి వత్తిడిలోకి నెట్టాలని ప్రయత్నించి తానే వత్తిడికి గురై చివరకు ఎడారి నేలలో నేలకరిచింది.
పాక్ బ్యాటింగ్ ఆర్డర్...
పాక్ తో మ్యాచ్ తో భారత్ లో కొంత వ్యతిరేక వ్యక్తమవుతుండటంతో జట్టు కూడా అలాగే కనిపించింది. చివరకు టాస్ వేసే సమయంలోనూ భారత్, పాక్ కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అఘాలు ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. షేక్ హ్యాండ్ కూడా చేసుకోలేదు. మ్యాచ్ అనంతరం కూడా ఎవరి దారి వాళ్లు వెళ్లిపోయారు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ బ్యాటర్లలో ఆయూబ్ డకౌట్ అయ్యాడు, ఫర్హాన్ మాత్రం నిలబడి నలభై పరుగులు చేశాడు. హారిస్ మూడు పరుగులకే వెనుదిగాడు. జమాన్ పదిహేడు పరుగులు చేసి అవుటయ్యాడు. అఘా కేలం మూడు పరుగులకే పరిమితం కాగా, హసన్ ఐదు పరుగులకుమించి చేయలేదు. మహ్మద్ నవాజ్ సున్నాకు అవుటయి,ఫషీమ్ పదకొండు పరుగులకు మాత్రమే చేశాడు. షషీన్ ఆఫ్రిది మాత్రం 33 పరుగులుచేశాడు.చివరలో నాలుగు సిక్స్ లు బాది స్కోరును పెంచాడు. లేకుంటే వంద పరుగులకు కూడా మించేది కాదు. దీంతో పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.
పెద్దగా కష్టపడకుండానే...
భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ రెండు, బుమ్రా రెండు హార్ధిక్ పాండ్యా ఒకటి, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు.127 లక్ష్యాన్ని అధిగమించేందుకు టీం ఇండియా పెద్దగా కష్టపడలేదు. భారత్ కు ఇది పెద్ద స్కోరు ఏమీ కాదు. భారత్ కు ఇది పెద్ద స్కోరు ఏమీ కాదు. అభిషేక్ శర్మ 31 పరుగులు, శుభమన్ గిల్ పది పరుగులు చేశాడు. సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్ స్ ఆడాడు. సూర్యకుమార్ 47, తిలక్ వర్మ్ 31 పరుగుల చేశాడు. ఇద్దరి భాగస్వామ్యం 56 పరుగులు అతి పెద్దది. శివమ్ దూబె పది పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.మొత్తం 15.5 ఓవర్లలోనే భారత్ 131 పరుగులు చేసింది. చివరి బంతిని సూర్యకుమార్ యాదవ్ సిక్స్ ను బాది భారత్ కు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ పై భారత్ మరోసారి తిరుగులేని విజయం సాధించింది.
Next Story

