Fri Dec 05 2025 09:14:50 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ లో

2026 ఆరంభంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఒక మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. 2026 జనవరిలో టీమిండియాతో 3 వన్డేలు, 5 టి20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ 8 మ్యాచ్‌ల కోసం జైపూర్, మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్, గువాహటి, హైదరాబాద్, త్రివేండ్రం, నాగ్‌పూర్ వేదికలను షార్ట్‌లిస్ట్ చేశారు.
జూన్ 14న జరగనున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం కివీస్‌తో షెడ్యూల్ ప్రకటించనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ల తర్వాత ఫిబ్రవరి–మార్చిలో భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. ఇక హైదరాబాద్ కు ఏ మ్యాచ్ కేటాయిస్తారో త్వరలోనే తెలియనుంది.
Next Story

