Fri Dec 05 2025 12:45:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్
భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది

భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. శ్రీలంక మీద సిరీస్ ను క్లీప్ చేసిన టీం ఇండియా మంచి ఉత్సాహంలో ఉంది. అలాగే పాకిస్థాన్ పై 2 -1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ కూడా అదే కసితో ఉంది. రెండు జట్లు బలంగా ఉన్నాయి. రానున్న వరల్డ్ కప్ కోసం ఈ మ్యాచ్ లు ఇరు జట్లకు ఎంతగాను ఉపయోగపడతాయి.
అందరి చూపు...
హైదరాబాద్ లో కూడా విరాట్ కొహ్లి మీదనే అందరి చూపు ఉంది. శ్రీలంకపై రెండు సెంచరీలు చేసిన కొహ్లి ఈ మ్యాచ్ లోనూ రాణిస్తాడని ఆయన అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు నిలకడగా ఆడుతుండటం కూడా భారత్ జట్టుకు మంచి పరిణామంగా పేర్కొనాల్సి ఉంటుందన్నారు. శ్రేయస్ అయ్యర్ గాయంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చూడాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రజిత్ పటేదార్ కు అవకాశం ఇవ్వనున్నారు. మహ్మద్ సిరాజ్ సొంతగడ్డపై తొలిసారి బౌలింగ్ చేస్తుండటం కూడా విశేషం. కేనే విలియన్స్, టిమ్ సౌథీలకు విశ్రాంతి ఇవ్వడంతో న్యూజిలాండ్ జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది. దీంతో భారత్ - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందన్న అంచనాలు వినపిస్తున్నాయి.
Next Story

