Sat Dec 07 2024 23:33:02 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia T20 : ఆసీస్ ముందు భారీ లక్ష్యం
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీ చేశారు
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీ చేశారు. ఇండియా ఇరవై ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా టార్గెట్ ను 236 పరుగులుగా నిర్దేశించింది. బౌలర్లకు అనుకూలమైన తిరువనంతపురం పిచ్ మీద భారత్ బ్యాటర్లు ఒక ఆటాడుకున్నారు. యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లు ముగ్గురు యాభై పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లను అందరినీ ఎడా పెడా ఆడేసుకున్నారు. చివర్లో వచ్చిన రింకూ సింగ్ కూడా సిక్సర్లు, ఫోర్లతో అదరగొట్టాడు.రింకూ సింగ్ తొమ్మిది బంతుల్లో 31 పరుగులు చేశాడు ఎలిస్ మూడు వికెట్లు తీశాడు.
సూర్య వచ్చిన వెంటనే...
సూర్యకుమార్ యాదవ్ వచ్చిన వెంటనే రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది.19 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. ఆస్ట్రేలియా ముందు భారీ పరుగులను నిర్దేశించింది. అయితే ఆసిస్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. అందుకే ఇప్పుడు బౌలర్లు తమ సత్తా చూపించాల్సి ఉంది. భారత్ ఇప్పటికే విశాఖ తొలి టీ 20 మ్యాచ్ లో గెలిచింది. ఇది కూడా విజయం సాధిస్తే సిరీస్ లో మనదే పై చేయి అవుతుంది. ఐదు మ్యాచ్ లసిరీస్ జరగనుంది.
Next Story