Fri Dec 05 2025 14:57:41 GMT+0000 (Coordinated Universal Time)
ఉన్నది నాలుగు వికెట్లు.. ఏదైనా జరగొచ్చు
విశాఖపట్నంలో జరుగుతున్న రెండోటెస్ట్ లో భారత్ విజయానికి నాలుగు అడుగుల దూరంలో ఉంది

విశాఖపట్నంలో జరుగుతున్న రెండోటెస్ట్ లో భారత్ విజయానికి నాలుగు అడుగుల దూరంలో ఉంది. అంటే నాలుగు వికెట్లు పడగొడితే రెండో టెస్ట్లో విజయం సాధించినట్లే. ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. బెన్ఫోక్స్ , బెన్ స్టోక్స్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇంకా 193 పరుగులు లక్ష్యంతో ఇంగ్లండ్ శ్రమిస్తుంది.
బౌలర్లు విజృంభిస్తే...
అయితే ఏదైనా జరగొచ్చు. నాలుగు వికెట్లు చేతిలో ఉండటంతో గెలుపు కంటే డ్రా చేసేందుకు ఎక్కువగా బ్యాటర్లు ప్రయత్నించే అవకాశాలున్నాయి. అదే సమయంలో భారత్ బౌలర్లు కూడా విజృంభిస్తే నాలుగు వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story

