Sun Dec 14 2025 00:23:37 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa : బౌలర్లదే పై చేయి.. ఈరోజు ఆటలో కుదురుకుంటే?
కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టుబిగింది.

కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టుబిగింది. దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకే ఆల్ అవుట్ చేసింది. మొదటి టెస్టు తొలి సెషన్లో భారత బౌలర్లు ఆధిపత్యం చాటారు. జస్ప్రిత్ బుమ్రా రెండు అద్భుతమైన బంతులతో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేశారు. వెంటనే కుల్దీప్ యాదవ్ కీలక సమయానికి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను పెవిలియన్‌కి పంపాడు. లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 27 ఓవర్లలో 105 పరుగలకు మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి 50 నిమిషాలు బాగానే రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు తర్వాత వరసగా అవుట్ అవుతూ అత్యధిక పరుగులకు చేరకుండానే ఇన్నింగ్స్ ను ముగించాల్సి వచ్చింది.
తక్కువ పరుగులకే...
ఎయిడెన్ మార్క్రమ్ మొదట ఆచి తూచి ఆడినా తర్వాత డ్రైవ్‌లు, లేట్ కట్, సిక్సర్‌తో వేగం పెంచాడు. మరోవైపు రికెల్టన్ ఇరవై రెండు పరుగులు చేసి ఆడుతూ డి భారత బౌలర్లను అసహనానికి గురి చేశాడు. 140 కిమీ వేగంతో వచ్చిన లెంగ్త్ బాల్ చివరి క్షణంలో బయటకు తిరిగి రికెల్టన్ ఆఫ్ స్టంప్‌ను కూల్చేసింది. తన తదుపరి ఓవర్లో బుమ్రా మరింత ఘాటు చూపించాడు. అప్‌డౌన్ ఉన్న పిచ్‌పై షార్ట్ లెంగ్త్ లో వచ్చిన బంతిని మార్క్రమ్ 31 పరుగులు చేశాడు. అయితే గ్లోవ్ తగిలి పంత్‌కు అందింది. బౌన్స్‌లో వచ్చిన తేడా పిచ్ స్వభావాన్ని మార్చింది. అంతేకాదు, బుమ్రా అదే ఓవర్లో బవుమాను కూడా ఇబ్బందులు పెట్టాడు. వెంటనే రంగంలోకి దిగిన కుల్దీప్ తన రెండో ఓవర్లోనే బవుమాను లెగ్–స్లిప్ ట్రాప్‌లో పడేశాడు. జురేల్ అద్భుత క్యాచ్ తీసుకున్నాడు.
జైశ్వాల్ నిరాశపర్చినా...
లంచ్ వరకు భారత బౌలర్లు నలుగురిని పెవిలియన్ కు పంపగలిగారు. 2012 నాగ్‌పూర్ టెస్ట్ తర్వాత తొలిసారిగా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగింది. సాయి సుధర్షన్కు బదులుగా అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు చేయగలిగింది. యశస్వి జైశ్వాల్ పన్నెండు పరుగులకే అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ పదమూడు పరుగులు, వాషింగ్టన్ సుందర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. సఫారీ బౌలింగ్ ను ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ లు ఆచితూచి ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా కంటే భారత్ ఇంకా 122 పరుగుల వెనుకంజలో ఉంది. ఈరోజు ధీటుగా ఆడుతూ దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్ విధించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మ్యాచ్ పై భారత్ కు పట్టుచిక్కుతుంది.
Next Story

