Tue Mar 17 2026 05:13:48 GMT+0530 (India Standard Time)
కుర్రాళ్లకు బీసీసీఐ నజరానా.. ఎంతంటే?
అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని కుర్రాళ్లు పండగ చేసుకున్నారు. మైదానంలో పరుగెత్తుతూ కప్ ను చూపిస్తూ సంబరపడిపోయారు. 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఇంగ్లండ్ ఆల్ అవుట్ అయింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ప్రారంబంలోనే షాక్ తగిలినా చివరకు నిలదొక్కు కోగలిగింది. చివరకు విజయం సాధించింది.
ఐదోసారి కప్....
ఐదోసారి భారత్ ఈ ప్రపంచ కప్ ను గెలిచినట్లయింది. అయితే ప్రపంచ కప్ ను గెలిచిన కుర్రాళ్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. క్రికెటర్లకు నలభై లక్షలు, టీం సహాయ సిబ్బందికి ఇరవై ఐదు లక్షలను నజరానాగా ప్రకటించింది.
Next Story

