Tue Jan 20 2026 10:04:30 GMT+0000 (Coordinated Universal Time)
సెమీస్ కు ముందు భారత్ కు షాక్
సెమీస్ కు ముందు భారత్ కు షాక్ తగిలింది. ప్రాక్టీస్ సందర్భంగా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమయింది

టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. సెమీ ఫైనల్స్ లో భారత్ ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ నెల 10వ తేదీ ఇంగ్లండ్ తో మ్యాచ్ జరగనుంది. అయితే ఆడిలైట్ కు చేరుకుంది. సెమీ ఫైనల్స్ లో గెలవాలంటే ప్రాక్టీస్ మరింత అవసరమని భావించి టీం ఇండియా జట్టు ఈరోజు ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది.
ప్రాక్టీస్ సందర్భంగా...
అయితే ప్రాక్టీస్ సందర్భంగా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమయింది. శర్మ ముంజేయిపై బలమైన గాయం కావడంతో వెంటనే ప్రాధమికి చికిత్స అందించారు. టీం సభ్యులు కొంత ఆందోళనకు గుర్యారు. నెట్ సెషన్ లో ప్రాక్టీస్ చేస్తుండగా బాల్ వచ్చి రోహిత్ కుడి చేయిని తాకడంతో ఈ గాయం తగిలినట్లు తెలిపారు. మరి ఆ గాయం ఏమేరకు అయింది? రోహిత్ గాయం నుంచి కోలుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story

