Fri Sep 13 2024 08:36:53 GMT+0000 (Coordinated Universal Time)
India Vs South Africa First Test : ఇదేమీ ఆట బాసూ... టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారా? టీ 20నా?
భారత్ దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ తడబడింది. వరస వికెట్లు పోవడంతో తక్కువ స్కోరుకే ఆరు వికెట్లు కోల్పోయింది
భారత్ దక్షిణాఫ్రికాతో తలపడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తడబడింది. వరసగా వికెట్లు కుప్పకూలి పోవడంతో తక్కువ స్కోరుకే ఎక్కువ వికెట్లు పోగొట్టుకుంది. దీంతో కష్టాల్లో టీం ఇండియా కూరుకుపోయింది. టెస్ట్ మ్యాచ్ అంటేనే జిడ్డుగా ఆడాలి. క్రీజును అంటిపెట్టుకుని ఉండి అవసరమైన సమయంలో షాట్లు కొడుతూ స్కోరును పెంచుతూ వెళ్లాలి. కావాల్సినంత సమయం. నిలకడగా ఆడితే ఐదు రోజుల పాటు క్రీజులోనే ఉండే అవకాశం ఒక్క టెస్ట్ మ్యాచ్ లోనే సాధ్యమవుతుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగి భంగపడింది.
వరసగా వికెట్లు కోల్పోయి...
అయితే భారత్ మాత్రం తొలి టెస్ట్ మ్యాచ్ లో టీ 20ని తలపించింది. 121 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిందంటే భారత్ బ్యాటర్లు ఏ మాత్రం ఆడారో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఐదో ఓవర్ లోనే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. రబాడ వేసిన బంతిని ఆడి క్యాచ్ ఇచ్చి ఐదు పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్ క్రీజులో ఉన్నారు. వీరైనా కొంత మంచి ప్రదర్శన చేస్తారనుకుంటే అదీ లేదు. పదిహేడు పరుగులు చేసి యశస్వి జైశ్వాల్ అవుట్ అయ్యాడు. పది ఓవర్లకు భారత్ అప్పటికి 23 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత క్రీజులోకి కొహ్లి వచ్చాడు. అయితే 12 ఓవర్ ప్రారంభంలోనే శుభమన్ గిల్ అవుటయ్యాడు. గిల్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 42 పరుగులకు భారత్ మూడు వికెట్లు కోల్పోయినట్లయింది.
నిలకడగా ఆడలేక...
కొహ్లి, శ్రేయస్ అయ్యర్ లు నిలకడగా ఆడుతున్నారులే అనుకున్న సమయంలో శ్రేయస్ 31 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 92 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయినట్లయింది. ఇక తర్వాత కోహ్లి, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. 38 పరుగులు చేసిన కొహ్లి అవుట్ కావడంతో ఇక భారమంతా కేఎల్ రాహుల్ పైనే పడింది. ప్రస్తుతం కేఎల్ రాహల్, శార్దూల్ ఠాకూర్ లు క్రీజులో ఉన్నారు. భారత్ 157 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇద్దరూ 23 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో కుదురుకున్నారు. మరి తొలి టెస్ట్ మ్యాచ్ లోనే భారత్ బ్యాటర్లు విఫలం కావడంతో ఈ మ్యాచ్ పై ఆశలు సన్నగిల్లినట్లే.
Next Story