Thu Dec 18 2025 23:05:24 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ పై ఇండియా విజయం
మహిళల టీ 20 వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది.

మహిళల టీ 20 వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ లో జరుగుతున్న తొలి మ్యాచ్ లో భారత బ్యాటర్లు విజృంభించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ 20 ఓవర్లకు 149 పరుగులు చేసింది.
ఛేదనలో...
భారీ స్కోరును ఛేజింగ్ చేసే దిశగా భారత్ బ్యాటర్లు తొలుత కొంత తడబడినా చివరకు దాయాది దేశంపై భారత్ విజయం సాధించింది. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు షెఫాలి వర్మ 33 పరుగులు, రీచా ఘోష్ 31 రాణించడంతో భారత్ కు విజయం దక్కింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ బ్యాటర్లు భారీ షాట్లు కొట్టడంతో పాక్ ను తొలి మ్యాచ్ లో ఓడించగలిగారు.
Next Story

