Wed Mar 18 2026 23:53:53 GMT+0530 (India Standard Time)
India vs Newzealand : క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే విక్టరీ.. వరల్డ్ కప్ కు ముందు సూపర్ విక్టరీ
ప్రపంచ కప్ ముందు భారత్ కు కిక్కిచ్చే విజయం లభిచింది.

ప్రపంచ కప్ ముందు భారత్ కు కిక్కిచ్చే విజయం లభిచింది. ఇప్పటికే సిరీస్ ను గెలుచుకున్న టీం ఇండియా చివరిదైన నాలుగో టీ20లోనూ విజయం సాధించింది ప్రపంచంలో టీ20 జట్టులో తమకు తాము సాటి లేదని నిరూపించుకుంది. తిరువనంతపురంలో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్‌పై భారత్ 46 పరుగుల విజయం సాధించి.. సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటి లాగే అభిషేక శర్మ దూకుడుతో ఆడగా, సంజూ శాంసన్ మరోసారి నిరాశపర్చాడు.
భారీ పరుగులు చేసి...
తిరువనంతపురంలో ఇషాన్ కిషన్ తొలి టీ20 అంతర్జాతీయ శతకం, అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాణించడంతో న్యూజిలాండ్‌పై భారత్ 46 పరుగుల తేడాతో గెలిచింది. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన ఐదో, చివరి మ్యాచ్‌లో ఈ విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 4-1తో ముగించింది. రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టు సిద్ధతలకు ఇది ఊతమిచ్చింది. భారీ స్కోరు దిశగా భారత్ దూసుకెళ్లింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 103 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 63 పరగులతో మూడో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు.
లక్ష్య చేధనలో...
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 225 పరుగులకే ఆలౌటైంది. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చిన అతడు, ఆ తర్వాతి మూడు ఓవర్లలో కేవలం 11 పరుగులకే నాలుగు వికెట్లు తీశాడు. ఫిన్ అలెన్ 80 పరుగుులతో దూకుడుగా ఆడినా లక్ష్యం దాటడం న్యూజిలాండ్‌కు సాధ్యం కాలేదు. రచిన్ రవీంద్రతో కలిసి రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అలెన్‌ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు పంపాడు. అక్షర్ పటేల్ మూడు , వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసి కివీస్ పతనాన్ని శాసించారు. మొత్తం మీద ప్రపంచకప్ కు ముందు భారత్ న్యూజిలాండ్ పై పరుగుల వరదను సృష్టించడం శుభపరిణామంగా చెప్పాలి.
Next Story

