Sun Dec 14 2025 00:22:44 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Australia T 20 : అంచనాల్లో తప్పిదమా? అతి విశ్వాసమా? ఓటమికి కారణాలేంటి?
ఆస్ట్రేలియా భారత్ పై మెల్ మోర్న్ లో జరిగిన టీ 20 మ్యాచ్ లో గెలిచింది.

ఆస్ట్రేలియా భారత్ పై మెల్ మోర్న్ లో జరిగిన టీ 20 మ్యాచ్ లో గెలిచింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో దారుణ ఓటమితో భారత్ చాలా రోజుల తర్వాత టీ20 మ్యాచ్ లలో అపజయం ఎదుర్కొంది. ఆసియా కప్ లోనూ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అన్ని మ్యాచ్ లు గెలిచి ఛాంపియన్ గా నిలిచిన టీం ఇండియా ఈ మ్యాచ్ లో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకోవాల్సి ఉందని అంటున్నారు. మెల్ బోర్న్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగినప్పుడు పిచ్ సంగతి తెలిసి దూకుడుగా ఆడకుండా నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచాల్సిన సమయంలో వికెట్లు టపా టపా పడిపోవడం ఛాంపియన్ టీం కు కొంత ఇబ్బందిగా మారింది.
వరస అవుట్ లతో...
రేపు మూడో మ్యాచ్ హోబర్ట్‌లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో అతి విశ్వాసానికి పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. శుభమన్ గిల్, సంజూశాంసన్, తిలక్ వర్మ వరసగా వికెట్లు పడటంతో మిగిలిన బ్యాటర్లపై వత్తిడి పెరిగింది. అక్షర్ పటేల్ అనవసరంగా రన్ అవుట్ అయి టీంపై మరింత వత్తిడి పెంచారు. రేపు జరగబోయే మ్యాచ్ లో ఈ తప్పులు జరగకుండా చూసుకోవాలని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ఓటమి ఎందులోనైనా సహజమేనని, అయితే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ఇన్నాళ్లూ అంచనా...
టీం ఇండియాకు ఇన్నాళ్లు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందన్న నమ్మకం అభిమానుల్లో ఉండేది. అయితే మెల్ బోర్న్ మ్యాచ్ లో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఒకరు అవుట్ అయితే దురదృష్టం అనుకోవచ్చు. బ్యాడ్ లక్ అని సరిపెట్టుకోవచ్చు. ముగ్గురు స్టార్ బ్యాటర్లు వరసగా క్రీజు నుంచి వెళ్లిపోవడం ఖచ్చితంగా మానవ తప్పిదమేనన్నకామెంట్స్ వినపడుతున్నాయి. హోబర్ట్ మ్యాచ్ లోనైనా తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్లకుంటే టీ 20 సిరీస్ కూడా చేజారిపోయే అవకాశముందని హెచ్చరికలకు టీం ఇండియా కు చేరుతున్నాయా?
Next Story

