Fri Dec 05 2025 11:30:53 GMT+0000 (Coordinated Universal Time)
రెండో వన్డేలో ఆస్ట్రేలియా లక్ష్యమిదే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఆడిలైడ్ లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ 264 పరుగులు చేసింది

భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఆడిలైడ్ లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ 264 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారత్ బ్యాటర్ల లో కెప్టెన్ శుభమన్ గిల్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరొకసారి విఫలమయ్యారు. విరాట్ కోహ్లి డకౌట్ అయి ఫ్యాన్స్ ను మరోసారి నిరాశపర్చాడు.
అత్యధిక పరుగులు చేసిన రోహిత్...
రెండో వన్డేలో రోహిత్ శర్మ 73 పరుగులు చేసి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగానిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 61 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ రాణించి 44 పరుగులు చేశాడు.హర్షిత్ రాణా 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అర్షదీప్ సింగ్ పదమూడు పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు, బార్ట్ లెట్ మూడు, మిచెల్ స్టార్క్ కు రెండు వికెట్లు తీసుకున్నారు. భారత బ్యాటర్లలో శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లు ఈ మ్యాచ్ లో నిరాశపర్చారు. ఇప్పుడు బౌలర్లు ఎలా వికెట్లు తీస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story

