Fri Dec 05 2025 11:30:56 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia 2nd One Day : భారత్ తుది జట్టు అంచనా ఇదే..నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే
భారత్ రెండో వన్డేకు సిద్ధమయింది. ఆస్ట్రేలియాతో నేడు ఆడిలైడ్ వేదికగా మ్యాచ్ జరగనుంది

భారత్ రెండో వన్డేకు సిద్ధమయింది. ఆస్ట్రేలియాతో నేడు ఆడిలైడ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలయిన టీం ఇండియా రెండో మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. గత కొద్ది రోజులుగా ఆడిలైడ్ లో నెట్ లో ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది. రెండో మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ సజీవంగా ఉంటుంది. యాభై ఓవర్ల మ్యాచ్ లో అత్యధిక స్కోరును చేయాలని టీం ఇండియా ఉవ్విళ్లూరుతుంది. బౌలింగ్ తొలుత చేసినప్పటికీ ఛేజింగ్ లో తమకున్న పదునేంటో చెప్పాలని గట్టిగా భావిస్తుంది. అందుకే స్వల్ప మార్పులతో ఈ మ్యాచ్ లో టీం ఇండియా బరిలోకి దిగనుంది.
ముగ్గురు స్పిన్నర్లతో...
అయితే ఆడిలైడ్ లో ముగ్గురు స్పిన్నర్లు టీం ఇండియా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అందులో ఇద్దరు ఆల్ రౌండర్లున్నారు. పేసర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. కులదీప్ యాదవ్ ను ఈ మ్యాచ్ లో తీసుకోనుందన్న వార్తలు వస్తున్నాయి. ఆడిలైడ్ మైదానంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కనుక కులదీప్ యాదవ్ ను ఖచ్చితంగా జట్టులోకి తీసుకుంటుంది. ఇప్పటికే పెర్త్ వన్ డే లో కులదీప్ యాదవ్ ను బెర్త్ కే పరిమితం చేశారన్న విమర్శలపై ఈసారి ఆ తప్పు చేసే అవకాశాలు కనిపించడం లేదు. హర్హిత్ రాణాను పక్కన పెట్టనుంది.
కోహ్లి,రోహిత్ లపై...
హర్షిత్ రాణాను తప్పించి కులదీప్ యాదవ్ ను తీసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ బలంగా ఉంటుందని భావిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా పేసర్ గా బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఆల్ రౌండర్ కోటాలో అతనిని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే కులదీప్ యాదవ్ ను మాత్రమే జట్టులోకి తీసుకుని, హర్షిత్ రాణాను తప్పించి మిగిలిన జట్టు యధాతధంగా ఉంచాలని జట్టు కోచ్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే సమయంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆటపైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఈ ఇద్దరూ సక్సెస్ అవ్వాలని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Next Story

