Fri Dec 05 2025 12:42:32 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia : విరాట్ రికార్డులు విన్నారా? ఇది విన్న వారికి ఎవరికైనా?
గురువారం ఆస్ట్రేలియాతో - భారత్ రెండో వన్డేలో తలపడనుంది. ఆడిలైడ్ లో ఈ మ్యాచ్ జరగనుంది

గురువారం ఆస్ట్రేలియాతో - భారత్ రెండో వన్డేలో తలపడనుంది. ఆడిలైడ్ లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మైదానంలో విరాట్ కోహ్లిపై అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి డకౌట్ కావడంతో కోహ్లి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మరొకవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తొలి వన్డేలో విఫలం కావడంతో ఇక వారు వన్డేల్లోనూ రిటైర్ అవ్వాలని మాజీ క్రికెటర్లు చేస్తున్న డిమాండ్ కూడా కోహ్లి ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే గురువారం జరిగే ఆడిలైడ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లి విశ్వరూపం ఖాయమని గట్టిగా విశ్వసిస్తున్నారు.
ఈ సిరీస్ లో గెలవాలంటే...
ఈ సిరీస్ లో ఇండియా గెలవాలంటే ఖచ్చితంగా ఆడిలైడ్ మ్యాచ్ ను గెలవాల్సి ఉంటుంది. లేకుంటే మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోతుంది. అయితే ఆడిలైడ్ లో గణాంకాలు చూస్తే విరాట్ కోహ్లి చెలరేగిపోవడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆడిలైడ్ టీ 20, టెస్ట్, వన్డేల్లో పదిహేను మ్యాచ్ లను విరాట్ కోహ్లి ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 975 పరుగులు చేయడాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఆడిలైడ్ మైదానం విరాట్ కు అచ్చొచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
గణాంకాలు మాత్రం...
విరాట్ కోహ్లి ఆడిలైడ్ లో ఐదు అర్థ సెంచరీలు చేసిన రికార్డులున్నాయి. నాలుగు సెంచరీలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక వన్డేల విషయానికి వస్తే ఆడిలైడ్ లో విరాట్ కోహ్లి నాలుగు మ్యాచ్ లు ఆడి 244 పరుగులు చేశాడు. అంటే సగటు 61 గా ఉంది. ఇప్పటి వరకూ ఆడిలైడ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్ గా కూడా విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ గురువారం జరిగే మ్యాచ్ లోనూ ఖచ్చితంగా బ్యాట్ తో విమర్శకులకు సమాధానం చెబుతారని అంటున్నారు. మరి చూడాలి విరాట్ నిజంగా చెలరేగిపోతాడా? చతికలపడతాడా? అన్నది రేపు తేలనుంది.
Next Story

