Fri Dec 05 2025 16:43:27 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Australia : పెర్త్ టెస్ట్ లో పట్టు బిగిస్తున్న భారత్
ఇండియా - ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా పట్టు బిగిస్తుంది

ఇండియా - ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట ప్రారంభమయ్యే నాటికి భారత్ ఒక వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 150 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా, ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ను భారత్ బ్యాటర్లు ధాటిగా ప్రారంభించారు.రెండో రోజు ఆట ప్రారంభమయిన తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ ను భారత్ కోల్పోయింది.
కేఎల్ రాహుల్ అవుట్ కావడంతో...
రాహుల్ 77 పరుగుల చేసి అవుటయ్యాడు. యశస్వి జైశ్వాల్ సెంచరీ చేసి ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు ఒక వికెట్ కోల్పోయి 201 పరుగులు చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ బౌలర్లు విజృంభించి ఆసిస్ బ్యాటర్లను త్వరగా అవుట్ చేయగలిగితే మ్యాచ్ మన చేతికి చిక్కినట్లే.
Next Story

