Fri Dec 05 2025 11:32:51 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia: ఆడితే గెలుపు ఎవరిది? భారత్ ఎన్ని పరుగులు చేసేదో తెలుసా?
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన కాన్ బెర్రాలో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన కాన్ బెర్రాలో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పదే పదే వర్షం పడుతుండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే భారత్ ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసే దిశగా ఆడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా కేవలం 9.4 ఓవర్లలోనే భారత్ ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేయగలిగింది. అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో అదరగొట్టినా తర్వాత అవుట్ కావడంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
దూకుడుగా ఆడటంతో...
సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ చెలరేగి ఆడారు. దూకుడుగా ఆడటంతో బౌండరీలు, సిక్సర్ల మోత మోగింది. తొలుత వర్షంతో మ్యాచ్ ఆగిపోయినప్పుడు మ్యాచ్ ను పద్దెనిమిది ఓవర్లకు కుదించారు. పద్దెనిమిది ఓవర్లు ఆడినప్పటికీ భారత్ 200 పరుగులకు పైగానే చేసి ఉండేది. ఆ లక్ష్యాన్ని ఛేజింగ్ లో అధిగమించడం ఆస్ట్రేలియాకు కష్టంగా మారేది. కానీ వర్షం ఆస్ట్రేలియా వైపు నిలిచిందనే చెప్పాలి. టీ 20లలో తమకు తిరుగులేదని చాటి చెప్పాలనుకున్న భారత్ కు వరుణుడు అడ్డుకట్ట వేసినట్లయింది. మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించి నట్లయింది.
స్కై బాదుడు చూసే...
ఇక సూర్యకుమార్ యాదవ్ రెండు భారీ సిక్సర్లు బాది రికార్డులను అధిగమించాడు. టీ 20లలో సూర్యకుమార్ యాదవ్ మొత్తం 150 సిక్సర్లు కొట్టి గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు. 150 సిక్సర్లు కొట్టిన ఐదో బ్యాటర్ గా ప్రపంచంలో స్కై నిలిచాడు. అత్యంత వేగంగా టీ20లలో 150 సిక్సర్లను కొట్టిన ఘనతను సూర్య దక్కించుకున్నాడు. 150 సిక్సర్లు బాదిన భారత్ లో రెండో ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్ ను చూడలేకపోయామని అభిమానులు నిరాశ చెందారు. శుక్రవారం రెండో టీ 20 మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి సత్తాచాటాలని కోరుకుందాం.
Next Story

